విజయవాడలో కృష్ణానదిపై మత్స్యకారులు భారీ స్థాయిలో బోట్ల ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గంగపుత్రులు తమ బోట్లతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. వరుసగా రెండో ఏడాది ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద నిధులు విడుదల చేయడంపై మత్స్యకార కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. వేట నిషేధ సమయంలో జీవనోపాధి దెబ్బతినకుండా ఒక్కో కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక భరోసా అందించడం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధిని కొనియాడారు.
గత ఏడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్ల సాయం అందించిన ప్రభుత్వం, ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్లను విడుదల చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకార కుటుంబాల్లో ఆనంద వాతావరణం నెలకొంది. తమ సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా కృష్ణానదిలో బోట్ల ర్యాలీ నిర్వహించామని మత్స్యకారులు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవాడలో ఆకట్టుకునేలా సాగగా, నదిపై వరుసగా ప్రయాణించిన బోట్ల దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















