Anumula Revanth Reddy పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు.సచివాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం ఉండదని హామీ ఇచ్చారు. ఇతర పెండింగ్ బిల్లులను కూడా త్వరలో చెల్లిస్తామని తెలిపారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించి రూ.480 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేయాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కోయిల్‌సాగర్, శంకరసముద్రం, కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకాల పనులను కూడా వేగవంతం చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు.
ఈ సందర్భంగా N. Uttam Kumar Reddy మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. “పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని భారాస నేతలు చెబుతున్నది వాస్తవానికి దూరం. ఈ ప్రాజెక్టును ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తాం” అని స్పష్టం చేశారు.మొదటి దశలో ఆరు జిల్లాల్లోని 1226 గ్రామాలకు తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. జూరాల జలాశయ పునరుద్ధరణకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, వానాకాలానికి ముందు చెరువుల్లో పూడికతీత పనులు చేపడతామని వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















