Nelloreలో దక్షిణ భారతదేశపు తొలి ప్రత్యేక ‘సీఅండ్‌ఐ కనెక్ట్-2026’ సదస్సు విజయవంతంగా ముగిసింది. SEIL Energy India Limited ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో విద్యుత్ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి.
ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీపీడీసీఎల్ థర్మల్, ప్రాజెక్టు డైరెక్టర్ కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. థర్మల్ విద్యుత్ కేంద్రాలు గరిష్ఠ ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు పెరుగుతున్న సైబర్ భద్రతా సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.
పునరుత్పాదక ఇంధన వినియోగం పెరగడం, గ్రిడ్‌లో లోడ్ అస్థిరత వంటి సమస్యలను అధిగమించేందుకు ఆధునిక ఆటోమేషన్ వ్యవస్థలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యుత్ రంగ నాయకత్వం, క్షేత్రస్థాయి నిపుణులు ఒకే వేదికపై సమావేశమై చర్చించడం ద్వారా భవిష్యత్ సవాళ్లకు సమర్థవంతమైన పరిష్కారాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి విద్యుత్ సంస్థలు, సాంకేతిక పరికరాల సరఫరాదారులకు చెందిన 150 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















