National Testing Agency నిర్వహించిన నీట్-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం తమ వ్యవస్థ ద్వారా లీక్ కాలేదని ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ స్పష్టం చేశారు. గురువారం పార్లమెంటరీ స్థాయీ సంఘం ఎదుట హాజరైన ఆయన.. పేపర్ మొత్తం లీక్ కాలేదని, కొన్ని ప్రశ్నలు మాత్రమే బయటకు వచ్చాయని తెలిపారు.
పేపర్ లీక్ ఎలా జరిగిందని ఎంపీలు ప్రశ్నించగా.. దీనిపై Central Bureau of Investigation దర్యాప్తు కొనసాగుతోందని సమాధానం ఇచ్చారు. దర్యాప్తు నివేదికను సమర్పించాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేయగా.. సీబీఐ స్వతంత్ర సంస్థ అని, దాని పనిలో జోక్యం చేసుకోవద్దని భాజపా సభ్యులు సూచించినట్లు సమాచారం.భవిష్యత్ పరీక్షల నిర్వహణలో తీసుకుంటున్న జాగ్రత్తలు, ఎన్‌టీఏలో సిబ్బంది కొరత వంటి అంశాలపై కూడా పార్లమెంటరీ సంఘం ప్రశ్నలు సంధించింది. సమావేశం అనంతరం కమిటీ చైర్‌పర్సన్ Digvijaya Singh మాట్లాడుతూ.. సమావేశంలో చర్చించిన అంశాలను వెల్లడించలేమని చెప్పారు.
ఇదిలా ఉండగా, Central Board of Secondary Education 12వ తరగతి పరీక్షల్లో ఈసారి ప్రవేశపెట్టిన ‘ఆన్ స్క్రీన్ మార్కింగ్’ విధానంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జవాబు పత్రాలను స్కాన్ చేసి ఆన్‌లైన్ ద్వారా మూల్యాంకనం చేయడంతో మార్కులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.పునర్మూల్యాంకనం కోసం విద్యార్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోగా.. పోర్టల్ పనిచేయకపోవడం, ఫీజులు అప్‌డేట్ కాకపోవడం, జవాబు పత్రాలు మసకబారినట్లు కనిపించడం వంటి సమస్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















