Hyderabad మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్టుకు భారీ ఆర్థిక ఊరట లభించింది. Indian Railway Finance Corporation మరియు L&T Metro Rail Hyderabad Limited మధ్య రూ.13,527 కోట్ల భారీ టర్మ్ లోన్ ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం ద్వారా పాత రుణాలను తక్కువ వడ్డీతో రీఫైనాన్స్ చేసుకునే అవకాశం లభించింది. గతంలో తీసుకున్న రుణాలకు గరిష్ఠంగా 9.5 శాతం వరకు వడ్డీ ఉండగా, తాజా ఒప్పందంతో కేవలం 3.5 శాతం వార్షిక వడ్డీకే రుణం లభించనుంది.దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఐఆర్‌ఎఫ్‌సీ సీఎండీ మనోజ్‌కుమార్ దూబే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి K. Ramakrishna Rao సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి.
తెలంగాణ ప్రభుత్వ హామీతో 20 ఏళ్ల కాలవ్యవధికి ఈ రుణ ఒప్పందం కుదిరింది. దీంతో మెట్రో ప్రాజెక్టుపై ఉన్న భారీ వడ్డీ భారం తగ్గడంతో పాటు భవిష్యత్తులో రెండో దశ విస్తరణకు కూడా మార్గం సుగమం కానుంది.
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్మించిన హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును గతంలో Larsen & Toubro నిర్వహించగా, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రాజెక్టును స్వాధీనం చేసుకుంది.మెట్రో విస్తరణతో నగర ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజారవాణా మరింత బలోపేతం అవుతుందని అధికారులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















