ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

అన్ని భాషల్లో నటించే అవకాశాలు ‘పుష్ప’ ద్వారా వచ్చాయని సునీల్‌ పేర్కొన్నారు

May 27, 2026
in Movies, News
0
అన్ని భాషల్లో నటించే అవకాశాలు ‘పుష్ప’ ద్వారా వచ్చాయని సునీల్‌ పేర్కొన్నారు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సునీల్‌ (Sunil) ప్రయాణం తరువాత పూర్తిగా కొత్త మలుపు తిరిగింది. ఒకప్పుడు కామెడీ రోల్స్‌తో గుర్తింపు పొందిన ఆయన, ఇప్పుడు హీరోగానూ, విలన్‌గానూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషా చిత్ర పరిశ్రమల్లో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారారు.

తాజాగా ఆయన మలయాళ సినిమా ‘కాటాలన్‌’ (Kattalan)లో కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం తెలుగులోనూ గురువారం (మే 28) విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సునీల్‌తో పాటు కబీర్‌ దుహాన్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్‌తో తన అనుభవాన్ని సునీల్‌ ఆసక్తికరంగా పంచుకున్నారు. “మీలో మంగళం శ్రీనును ఎలా చూశారు?” అనే ప్రశ్నకు స్పందిస్తూ, అది తనకూ షాకింగ్‌గా అనిపించిందని నవ్వుతూ చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో సుకుమార్‌కు తాను కామెడీ కాకుండా వేరే పాత్రలు చేయాలని చెప్పానని, ఆ తర్వాత రెండు రోజుల్లోనే ఆయన నుంచి కాల్ వచ్చిందని తెలిపారు.

“పుష్పలో పూర్తిస్థాయి విలన్‌ పాత్రకు నిన్ను అనుకుంటున్నా. అందులో నువ్వు కామెడీ చేయకూడదు. శరీరం కూడా కదలకుండా హావభావాలతోనే నటించాలి” అని సుకుమార్ చెప్పినట్టు సునీల్‌ గుర్తుచేశారు. లుక్‌ టెస్ట్ కోసం ప్రత్యేక కాస్ట్యూమ్స్ పంపించారని, వాటితో భిన్నమైన స్టైల్స్‌లో ఫోటోలు తీసి పంపగా టీమ్‌కు బాగా నచ్చిందని చెప్పారు. షూటింగ్ రోజులంతా నుదుటి భాగం షేవ్ చేసుకోవాల్సి వచ్చిందని కూడా వెల్లడించారు.

‘పుష్ప’ సినిమా తన కెరీర్‌ను పూర్తిగా మార్చేసిందని సునీల్‌ తెలిపారు. ఈ సినిమా తర్వాతే అన్ని భాషల్లో నటించే అవకాశాలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. అల్లు అర్జున్‌ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప 1’ మరియు ‘పుష్ప 2’ చిత్రాలు భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే.

ఇక ‘కాటాలన్‌’ సినిమాలో సునీల్‌ “మారి” అనే పాత్రలో కనిపించనున్నారు. ఆంటోనీ వర్గీస్‌, కబీర్‌ దుహాన్‌ సింగ్‌, దుషారా విజయన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పాల్‌ జార్జ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏనుగు దంతాల అక్రమ రవాణా నేపథ్యంతో రూపొందింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: ActorLifeActorSunilAllLanguagesCinemaUpdateEntertainmentNewsFilmCareerFilmIndustryIndianCinemaMovieNewsNewsPushpashivasakthi netshivasakthi newsshivasakthimediaSunilTeluguCinemaTollywood
ShareTweetSend
Previous Post

తెలివైన తాబేళ్ళు

Next Post

మమితా బైజు తొలి నాయికా ప్రాధాన్య చిత్రం ప్రారంభం

Related Posts

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)
Rasi Phalalu

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 11, 2026
మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!
Health

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

September 10, 2026
చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!
Health

చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

September 10, 2026
మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!
Health

మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!

September 10, 2026
నట్స్‌ కొన్నారా? ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి!
Health

నట్స్‌ కొన్నారా? ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి!

September 10, 2026
యూఐఐసీఎల్‌లో 225 కొలువులు.. డిగ్రీతోనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అవకాశం
Education

యూఐఐసీఎల్‌లో 225 కొలువులు.. డిగ్రీతోనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అవకాశం

September 10, 2026
Next Post
మమితా బైజు తొలి నాయికా ప్రాధాన్య చిత్రం ప్రారంభం

మమితా బైజు తొలి నాయికా ప్రాధాన్య చిత్రం ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 11, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 11, 2026
మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

September 10, 2026
చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

చిన్న వయసులోనే ముడతలా? వీటిని ఆహారంలో చేర్చుకోండి!

September 10, 2026
మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!

మాయిశ్చరైజర్‌ కోసం బయట ఉత్పత్తులే అవసరం లేదు.. ఇవీ ప్రయత్నించొచ్చు!

September 10, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 11, 2026
మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

మొటిమలు తగ్గాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకోండి!

September 10, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.