చిట్‌ఫండ్ బకాయిల వసూళ్ల విషయంలో పూచీకత్తుదారుల బాధ్యతపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రుణగ్రస్తుడిపై ముందుగా రికవరీ చర్యలు చేపట్టకుండానే పూచీకత్తుదారుపై నేరుగా చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
చిట్‌ఫండ్ సంస్థలు బకాయిల వసూళ్లలో భాగంగా పూచీకత్తుదారి జీతాన్ని కూడా ఎటాచ్ చేయవచ్చని హైకోర్టు పేర్కొంది. అప్పు తీసుకున్న వ్యక్తి నుంచి రికవరీకి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతే గ్యారంటీ ఇచ్చిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలనే నిబంధన చిట్ చట్టంలో లేదని తెలిపింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కూడా హైకోర్టు గుర్తు చేసింది. పూచీకత్తు ఇవ్వడం వల్లనే చందాదారుకు చిట్ సొమ్ము పొందే అవకాశం లభిస్తుందని, అందువల్ల రుణగ్రస్తుడితో సమాన బాధ్యత పూచీకత్తుదారిపై కూడా ఉంటుందని పేర్కొంది.
అదనపు, సంయుక్త, డిప్యూటీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు కూడా చిట్ చట్టం ప్రకారం రిజిస్ట్రార్ నిర్వచనంలోకే వస్తారని, వారు జారీ చేసే రికవరీ సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. ఆ సర్టిఫికెట్ సివిల్ కోర్టు డిక్రీతో సమానమని పేర్కొంది.
రేపల్లెకు చెందిన కంబాల వెంకట రామారావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కపిల్ చిట్ కోస్తా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన రూ.6.09 లక్షల చిట్ బకాయిల కేసులో రామారావు పూచీకత్తుదారుగా ఉన్నారు. చందాదారు బకాయిలు చెల్లించకపోవడంతో గుంటూరు కోర్టు ఆయన జీతాన్ని ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















