ఆంధ్రప్రదేశ్ వైద్యరంగంలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తూ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. మెడ్‌టెక్ ఛాలెంజ్ విధానంలో ఏఐ ఆధారిత వైద్యసేవలను ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్‌ను ‘లైట్‌హౌస్ స్టేట్’గా తీర్చిదిద్దామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
మంగళగిరిలోని రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH)లో నిర్వహించిన ‘ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థల వ్యూహాత్మక సదస్సు’ మరియు ‘ఏపీ మెడ్‌టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలే’ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు సమర్థ వినియోగంతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యసేవలు అందించవచ్చని తెలిపారు. దీని వల్ల కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం తగ్గుతుందని అన్నారు.
నేషనల్ హెల్త్ అథారిటీ జాయింట్ సెక్రటరీ కిరణ్‌గోపాల్ వాస్క మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ఆరోగ్యరంగంలో ఏఐ వినియోగంలో దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వం, స్టార్టప్‌లు, పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేస్తేనే సాంకేతిక పరివర్తన సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఆర్‌టీఐహెచ్ సీఈవో ధాత్రిరెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యరంగంలో వినూత్న ఆవిష్కరణలు చేసే స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 300 కళాశాలల్లో ఈ-సెల్స్ ఏర్పాటు చేసి యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.మెడ్‌టెక్ ఛాలెంజ్‌లో భాగంగా 18 అంకుర సంస్థలు నాలుగు విభాగాల్లో ఏఐ ఆధారిత వ్యాధి నిర్ధారణ పరికరాలను ప్రదర్శించాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సంస్థలకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















