దేశవ్యాప్తంగా ప్రజలందరికీ పబ్లిక్ వైఫై అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పీఎం వాణి (Prime Minister WiFi Access Network Interface) పథకం విస్తరణపై కేంద్రం దృష్టి సారించింది. ఈ మేరకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ టెలికాం అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు.
విద్యార్థులు, ప్రయాణికులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు సహా ప్రతి ఒక్కరికీ తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. QR కోడ్ ఆధారిత లాగిన్ విధానం ద్వారా మొబైల్‌లో స్కాన్ చేసి సులభంగా వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయ్యే సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు.
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 15 నిమిషాలు, 30 నిమిషాలు, 60 నిమిషాల ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లు, మాల్స్, బహిరంగ ప్రదేశాల్లో పీఎం వాణి హాట్‌స్పాట్‌లను సులభంగా గుర్తించేందుకు ప్రత్యేక ప్రామాణిక గుర్తులు కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా డిజిటల్ కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















