ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ ఒడెహ్‌ను హతమార్చినట్లు ప్రకటించింది. గాజా సిటీలోని ఒక మార్కెట్ ప్రాంతంపై మంగళవారం జరిపిన వైమానిక దాడిలో ఆయన మరణించినట్లు వెల్లడించింది. ఈ దాడిలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
మృతుల్లో మహమ్మద్ ఒడెహ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు—భార్య, కుమారుడు, కుమార్తెతో పాటు మరో మహిళ కూడా ఉన్నట్లు స్థానిక ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఇంతకు ముందు హమాస్ మిలిటరీ చీఫ్‌గా ఉన్న ఇజ్ అల్ దిన్ అల్ హద్దద్‌ను ఈ నెల 16న హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆ ఘటన తర్వాత పదిరోజుల్లోనే ఒడెహ్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు పేర్కొంది.
2023లో ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన ‘అక్టోబర్ 7’ దాడుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుని చర్యలు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని Benjamin Netanyahu హెచ్చరించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















