దేశవ్యాప్తంగా నిర్వహించిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని యూపీఎస్‌సీ బుధవారం విడుదల చేసింది. పరీక్ష ముగిసిన తర్వాత కీ విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించిన యూపీఎస్‌సీ, ఆ హామీ ప్రకారం ఈ నెల 24న పరీక్ష ముగియగా మూడో రోజునే కీని విడుదల చేసింది.
ఈసారి పేపర్-1లో మొత్తం 100 ప్రశ్నలు ఉండగా, 99 ప్రశ్నలకు మాత్రమే కీ విడుదల చేయడం గమనార్హం. ఒక ప్రశ్నను తప్పుగా లేదా వివాదాస్పదంగా గుర్తించి తొలగించినట్లు తెలుస్తోంది. రెండో పేపర్‌లో మాత్రం 80 ప్రశ్నలన్నింటికీ ప్రాథమిక కీ విడుదల చేసింది.
ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఈ నెల 31వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పంపించవచ్చని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యంతరాలు పంపే అభ్యర్థులు తప్పనిసరిగా ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. అందులో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, ప్రభుత్వ ప్రచురణలు, జర్నళ్లు, పీఐబీ సమాచారం వంటి ప్రామాణిక వనరులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో బ్రెయిన్ ట్రీ శిక్షణా సంస్థ డైరెక్టర్ వి. గోపాలకృష్ణ మాట్లాడుతూ, అభ్యంతరాల ప్రక్రియలో బలమైన ఆధారాలు సమర్పించడం అత్యంత ముఖ్యమని సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















