హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాయదుర్గం గ్రోత్ కారిడార్‌లో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) నిర్వహించిన ఈ-వేలంలో ఎకరా భూమి రికార్డు స్థాయిలో రూ.237 కోట్ల ధర పలికింది. దీంతో దేశంలోనే అత్యంత ఖరీదైన కమర్షియల్ భూముల జాబితాలో హైదరాబాద్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.
రాయదుర్గం ప్రాంతంలోని 6.29 ఎకరాల మల్టీ-యూజ్ భూమికి టీజీఐఐసీ ఎకరాకు రూ.139 కోట్ల రిజర్వు ధర నిర్ణయించింది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు భారీగా పోటీపడటంతో ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగాయి. చివరకు మొత్తం రూ.1,490.73 కోట్ల భారీ మొత్తానికి ఈ ప్లాట్ అమ్ముడైంది. హైదరాబాద్‌కు చెందిన గౌర వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ భూమిని దక్కించుకుంది.
హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఐటీ కేంద్రాలకు సమీపంలో ఉండటం వల్ల రాయదుర్గం భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో మౌలిక వసతుల విస్తరణ, మెట్రో కనెక్టివిటీ, అంతర్జాతీయ కంపెనీల రాక, ఐటీ రంగ అభివృద్ధి కారణంగా భూముల ధరలు ఏడాదికేడాది కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.
2017లో ఇదే ప్రాంతంలో ఎకరా రూ.42 కోట్ల ధర పలికిన భూములు, 2022 నాటికి రూ.100 కోట్ల మార్క్ దాటాయి. 2025లో రూ.177 కోట్ల రికార్డు నమోదు కాగా.. ఇప్పుడు ఏకంగా రూ.237 కోట్లకు చేరడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్‌కు నిదర్శనంగా నిలిచింది.
ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో రాష్ట్ర హౌసింగ్‌బోర్డు నిర్వహించిన ఈ-వేలం కూడా భారీ స్పందన తెచ్చుకుంది. విమానాశ్రయానికి సమీపంలో ఉండటంతో చ.గజం గరిష్ఠంగా రూ.83,500 ధర పలికింది. నాలుగు ల్యాండ్ పార్సిళ్ల ద్వారా సుమారు రూ.140 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















