Toyota దేశీయ మార్కెట్లో తన తొలి ఎలక్ట్రిక్ SUV అయిన టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లాను అధికారికంగా లాంచ్ చేసింది. మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో విడుదలైన ఈ కారు, Hyundai క్రెటా ఎలక్ట్రిక్, MG Motor జడ్‌ఎస్ ఈవీ, Maruti Suzuki ఈ-విటారాలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
మారుతీ సుజుకీ ఈ-విటారా ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసినప్పటికీ, టయోటా ప్రత్యేక డిజైన్ ఎలిమెంట్స్‌తో ఈ కారును ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. రూ.23.60 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ SUV రెండు బ్యాటరీ వేరియంట్లలో లభ్యమవుతోంది. 49kWh మరియు 61kWh బ్యాటరీ ప్యాక్‌లతో వచ్చిన ఈ వాహనం, పెద్ద బ్యాటరీ వేరియంట్‌లో సింగిల్ ఛార్జ్‌తో 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 172bhp పవర్, 189Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ ఉన్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్, 12 కలర్ అంబియెంట్ లైటింగ్, JBL సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైర్ వంటి ప్రీమియం ఫీచర్లు అందించారు.
సేఫ్టీ విషయంలో కూడా ఈ SUV ప్రత్యేకంగా నిలుస్తోంది. స్టాండర్డ్‌గా 7 ఎయిర్‌బ్యాగులు, ABS, EBD, ESP, 360 డిగ్రీ కెమెరా, లెవల్-2 ADAS వంటి ఆధునిక భద్రతా ఫీచర్లను టయోటా అందించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















