దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ పవిత్ర క్షేత్రంలో స్వామివారికి వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగించేలా చల్లదనానికి ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
జైపుర్‌కు చెందిన శేఖర్ అగర్వాల్ నేతృత్వంలోని పది మంది భక్తులు సుమారు 320 కిలోల మల్లెపూలను సమర్పించారు. ఈ పూలతో ఆలయ గర్భగుడి, నంది హాల్‌ను అద్భుతంగా అలంకరించారు. సహజంగా చల్లదనాన్ని అందించే మల్లెపూల సువాసనతో ఆలయం పరిమళభరితంగా మారింది.
భక్తి భావంతో చేసిన ఈ సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వేసవి కాలంలో స్వామివారికి చల్లదనం కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రత్యేక పుష్పాలంకరణ చేపట్టినట్లు భక్తులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















