అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ ట్రంప్ వ్యక్తిగత పర్యటనలో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్నారు.
శుక్రవారం దిల్లీ చేరుకున్న ఆమె ప్రఖ్యాత అక్షరధామ్ ఆలయంను సందర్శించారు. ఆలయ శిల్పకళను చూసి ఆమె అబ్బురపడ్డారని సమాచారం. ఆలయ ఆవరణలో ఉన్న 108 అడుగుల నీలకంఠ్ వర్ణీ విగ్రహాన్ని కూడా సందర్శించారు.
తన సందర్శనకు సంబంధించిన ఫోటోలను టిఫానీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అనంతరం ఆమె ఆగ్రా వెళ్లి ప్రపంచ ప్రసిద్ధ తాజ్ మహల్ను సందర్శించనున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి రాజస్థాన్‌లోని జైసల్మేర్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది.
ఇది వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 2018లో ఆమె తండ్రి డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో అధికారిక పర్యటన చేసిన సమయంలో టిఫానీ కూడా ఆయనతో కలిసి భారత్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















