భారత్‌లో సెమీకండక్టర్ సబ్‌స్ట్రేట్ తయారీ రంగంలో కీలక ముందడుగు పడింది. చిప్ తయారీ దిగ్గజ సంస్థ ఇంటెల్, ఒడిశా ప్రభుత్వం, 3డీజీఎస్ సంస్థల మధ్య ఈ మేరకు అవగాహనా ఒప్పందం కుదిరింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, ఇంటెల్ సీఈఓ లిప్-బు టాన్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
దాదాపు 3.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ.30,000 కోట్లు) అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద హైటెక్ తయారీ పెట్టుబడుల్లో ఒకటిగా నిలవనుంది. కంప్యూటర్ చిప్ రంగంలో అగ్రగామి సంస్థ అయిన ఇంటెల్ ప్రత్యక్ష భాగస్వామ్యంతో భారత్‌లోకి వస్తున్న తొలి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.
ఈ ప్రాజెక్ట్ రాబోయే 5–6 ఏళ్లలో పలు దశల్లో పూర్తికానుంది. భువనేశ్వర్–ఖుర్దా ప్రాంతంలో ఈ అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్లాంట్ ద్వారా 1800 మందికి పైగా అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
సెమీకండక్టర్ సబ్‌స్ట్రేట్ తయారీ ప్రక్రియలో అత్యంత స్వచ్ఛమైన సిలికాన్ లేదా సిలికాన్ కార్బైడ్ వంటి ముడి పదార్థాలను లోపరహిత వేఫర్లుగా మారుస్తారు. ఇవి మైక్రోచిప్‌ల తయారీకి కీలక ఆధారంగా పనిచేస్తాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews


















