పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ముజఫ్ఫరాబాద్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు జీషాన్ మిర్ శనివారం రాత్రి నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) దాటి భారత భద్రతా దళాలకు స్వయంగా లొంగిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర కశ్మీర్‌లోని ఉరీ సెక్టార్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ దుస్సాహసానికి కారణం సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన ప్రేమ సంబంధమని తెలుస్తోంది. బారాముల్లా జిల్లా తల్వారి గ్రామానికి చెందిన ఇరమ్ బానో అనే యువతితో స్నాప్‌చాట్ ద్వారా జీషాన్ పరిచయం పెంచుకున్నాడు. తన కుటుంబ నేపథ్యం బారాముల్లా ప్రాంతానికి చెందినదిగా ఉండటంతో ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడినట్లు సమాచారం.
జీషాన్ తరచూ స్నాప్‌చాట్‌లో ఆమెతో మాట్లాడుతూ తన వ్యక్తిగత, కుటుంబ సమస్యలను పంచుకునేవాడని తెలిసింది. భారత్‌లోకి రావాలని ఇరమ్ బానో అతనికి సూచించినట్లు విచారణలో వెల్లడైంది. ఎల్‌వోసీ దాటి భారత భద్రతా దళాలకు లొంగిపోయిన తర్వాత చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యాక తన పూర్వీకుల ఆధారాలు సమర్పించి భారత్‌లోనే ఉండాలని ఇద్దరూ ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.
సైనిక దళాలు జీషాన్‌ను అదుపులోకి తీసుకున్న అనంతరం ఇరమ్ బానోను విచారించగా ఆమె ఇచ్చిన వివరాలు అతడి కథనంతో సరిపోలినట్లు అధికారులు తెలిపారు. అనంతరం మరింత విచారణ నిమిత్తం జీషాన్‌ను జమ్మూ కశ్మీర్ పోలీసులకు అప్పగించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















