పహల్గాం ఉగ్రదాడి కేసులో పాకిస్థాన్‌లోని ఓ ప్రముఖ బ్యాంక్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదులు ఉపయోగించిన ఫోన్లలో ఒకటి కొనుగోలుకు సంబంధించిన కన్సైన్‌మెంట్ ఫైనాన్సింగ్‌ను పాక్‌లోని ఫైసల్ బ్యాంక్ సమకూర్చినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
దాడి అనంతరం ఉగ్రవాదుల నుంచి రెండు షావోమీ హ్యాండ్‌సెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక ఫోన్‌ను కరాచీకి చెందిన టెక్ సిరత్ ప్రైవేట్ లిమిటెడ్ 2021లో దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు. ఆ దిగుమతికి సంబంధించిన లావాదేవీలకు ఫైసల్ బ్యాంక్ ఫైనాన్సింగ్ చేసినట్లు సమాచారం. అయితే పహల్గాం దాడితో ఈ బ్యాంక్‌కు నేరుగా సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని దర్యాప్తు వర్గాలు స్పష్టం చేశాయి.
అదే సమయంలో గతంలో లష్కరే తయ్యిబా, లజ్‌నత్ అల్ దవా, అల్-ఖైదాతో సంబంధాలున్న కువైట్ సంస్థలు ఫైసల్ బ్యాంక్‌తో కలిసి పనిచేసినట్లు పాత నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అలాగే ఆ బ్యాంక్‌లో ఉగ్ర సంస్థలు డిపాజిట్లు నిర్వహించినట్లు 2007లో అమెరికా పత్రిక ఒక కథనంలో పేర్కొంది.
దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఫైసల్ జాట్ వద్ద రెండు షావోమీ రెడ్‌మీ ఫోన్లు (9టీ, నోట్ 12) ఉన్నట్లు గుర్తించారు. వీటిని 2021, 2023లో దిగుమతి చేసుకున్నప్పటికీ దాడి వరకు వాటిని ఉపయోగించలేదని తెలుస్తోంది. ఎంపిక చేసిన ఉగ్రవాదికి అప్పగించేందుకు వీటిని సిద్ధంగా ఉంచి, స్విచ్ ఆఫ్ చేసి ఉంచి ఉండవచ్చని దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















