విశాఖ జిల్లా ఆనందపురం–పెందుర్తి జాతీయ రహదారి (ఎన్‌హెచ్16)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులైన కొరియోగ్రాఫర్, ఈటీవీ ‘ఢీ’ షో ఫేమ్ పండు మాస్టర్ తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘటనలో ఆయనకు రెండు కాళ్లకు, తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు, సహచరులు అతడిని నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు.
వివరాల ప్రకారం, భీమిలి మండలం తగరపువలసలో గ్రామదేవత ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో పండు మాస్టర్ బృందం పాల్గొంది. కార్యక్రమం ముగించుకుని విశాఖ వైపు తిరిగి వస్తున్న సమయంలో ఆనందపురం మండలం లొడగలవానిపాలెం సమీపంలో పండుకు అస్వస్థతగా అనిపించడంతో వాహనం ఆపి కిందికి దిగారు.
అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కోళ్లతో లోడ్ అయిన మినీవ్యాన్ వారి కారును ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు ముందు భాగంలో ఉన్న పండు మాస్టర్‌పైకి ఆ వాహనం దూసుకెళ్లడంతో ఆయన కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో లిఖితప్రియ, హారిక అనే ఇద్దరు యువతులకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.
పండు మాస్టర్ స్పృహ కోల్పోవడంతో వెంటనే వెంకోజిపాలెంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల ప్రకారం ఆయన ఎడమ తుంటి కీలు డిస్‌లొకేషన్ కాగా, మోకాళ్ల కింద రెండు కాళ్లు విరిగినట్లు గుర్తించారు. హిప్ జాయింట్‌ను సరిచేసిన వైద్యులు, త్వరలో రెండు కాళ్లకు శస్త్రచికిత్స చేయనున్నట్లు తెలిపారు. పూర్తి కోలుకోవడానికి సుమారు ఆరు నెలల సమయం పట్టవచ్చని వైద్యులు వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















