పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పుర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన పుల్లగురం దీపక్‌రెడ్డి (36) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బుధవారం కళాశాల ఆవరణలోని స్టాఫ్ క్వార్టర్‌లో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఐఐటీ ఖరగ్‌పుర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో దీపక్‌రెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఖరగ్‌పుర్ ఎస్‌డీపీవో సిద్ధార్థ్ సింగ్ తెలిపారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు, కారణాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















