తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు మరింత విస్తరించనుంది. ఈ ప్రాజెక్టు కోసం అదనంగా 301 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామ పరిధిలోని ప్రైవేటు పట్టాదారులు, రైతుల నుంచి ఈ భూములను సేకరించనున్నారు.
బహుళజాతి సంస్థలు, గ్లోబల్ కార్పొరేట్ కంపెనీల కార్యాలయాల ఏర్పాటుకు అనువైన మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం భూసేకరణ బాధ్యతలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు అప్పగించింది.
ఇప్పటికే గత నెల 29న రెవెన్యూ శాఖ అధికారులు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రామసభ నిర్వహణ అనంతరం అధికారికంగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు సుమారు రూ.82 లక్షల వరకు పరిహారం చెల్లించే అవకాశం ఉందని సమాచారం.
ఫ్యూచర్ సిటీని తొలుత 14 వేల ఎకరాల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అయితే తెలంగాణ రైజింగ్-2047 సదస్సు తర్వాత పలువురు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ముందుకు రావడంతో అదనపు భూముల అవసరం ఏర్పడింది.
పలు ప్రముఖ కార్పొరేట్ సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపడంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో వెయ్యి ఎకరాల వరకు అదనపు భూమి అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి దశలో 301 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు వేలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews