అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్, ఆయన ప్రియురాలు బెట్టినా ఆండర్సన్ వివాహ వేడుకకు సంబంధించిన ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. బహమాస్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలు, పార్టీల కోసం రష్యాకు చెందిన వ్యాపారవేత్త, అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ అధిపతి ఉమర్ క్రెమ్లెవ్ లక్షలాది డాలర్లు ఖర్చు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ వార్తలపై జూనియర్ ట్రంప్, బెట్టినా ఆండర్సన్ స్పందిస్తూ క్రెమ్లెవ్ తమ సన్నిహితుడని తెలిపారు. తమ వివాహ వేడుకలను ఆయన అద్భుతంగా నిర్వహించారని, ఈ ‘అసాధారణ కానుక’కు ఎంతో కృతజ్ఞతలు అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. దీంతో జూనియర్ ట్రంప్ వివాహానికి క్రెమ్లెవ్ నిధులు సమకూర్చిన విషయం దంపతులే ధ్రువీకరించినట్లైంది.
క్రెమ్లెవ్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. 2026 ఏప్రిల్‌లో పుతిన్ ఆయనకు ‘ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్’ పురస్కారాన్ని అందించినట్లు వార్తలు వెలువడ్డాయి. అలాగే 2025 సెప్టెంబరులో ఇస్తాంబుల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జూనియర్ ట్రంప్, క్రెమ్లెవ్ కలిసి పాల్గొన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఇరాన్‌తో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భద్రతా కారణాలతో డొనాల్డ్ ట్రంప్ తన కుమారుడి వివాహ వేడుకలకు హాజరు కాలేదని సమాచారం. తాజా పరిణామంతో ట్రంప్ కుటుంబానికి రష్యాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో ఉన్న సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















