టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త iOS 27 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అధికారికంగా ప్రకటించింది. కాలిఫోర్నియాలో జరుగుతున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)లో ఈ కొత్త అప్డేట్ను పరిచయం చేసింది. ప్రస్తుత iOSలో పలు మార్పులతో పాటు అత్యాధునిక ఫీచర్లను జోడిస్తూ యాపిల్ ఈ అప్డేట్ను రూపొందించింది.
కొత్త iOS 27లో “లిక్విడ్ గ్లాస్” డిజైన్‌ను మెరుగుపరిచింది. ఫోటోస్, మెయిల్ యాప్స్‌లో వినియోగదారులకు మరింత సులభంగా ఉపయోగించుకునే కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. అదేవిధంగా చైల్డ్ సేఫ్టీ ఫీచర్లను మరింత బలోపేతం చేసింది. యాపిల్ ఇంటెలిజెన్స్ మద్దతుతో కొత్త Siri AIని కూడా ఆవిష్కరించింది.
iOS 27 ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి రానుంది. ఐఫోన్ 11 తర్వాత విడుదలైన అన్ని మోడళ్లకు ఈ అప్డేట్ అందుబాటులో ఉంటుంది. అలాగే iPhone SE (2020) మోడల్‌కు కూడా ఈ సాఫ్ట్వేర్ సపోర్ట్ ఉంటుంది.
ఈ కొత్త ఫీచర్లను ముందుగానే ఉపయోగించాలనుకునేవారు Apple విడుదల చేసిన iOS బీటా-1 ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ కావాలి. ఇందుకోసం beta.apple.com వెబ్‌సైట్‌కి వెళ్లి Apple IDతో సైన్-అప్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంగీకరించాలి. తర్వాత iPhone సెట్టింగ్స్‌లోకి వెళ్లి General → Software Update → Beta Updates లో Developer Beta ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అప్పుడు కొత్త అప్డేట్ కనిపిస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే ఇన్స్టాల్ చేయడానికి ముందు డేటా బ్యాకప్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
iOS 27 ఈ ఫోన్లకు అందుబాటులో ఉంటుంది: iPhone 16 సిరీస్, iPhone 15 సిరీస్, iPhone 14 సిరీస్, iPhone SE (2022), iPhone 13 సిరీస్, iPhone 12 సిరీస్, iPhone 11 సిరీస్, iPhone SE (2020).
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















