ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
భద్రకాళి అమ్మవారి సన్నిధిలో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
పవన్ కల్యాణ్ రాకతో భద్రకాళి ఆలయ పరిసరాల్లో భక్తి శ్రద్ధలతో పాటు సందడి వాతావరణం నెలకొంది. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, జనసేన కార్యకర్తలు, జనసైనికులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంతం జనసంద్రంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

















