కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ దిశగా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆమె పేర్కొన్నారు.
విశాఖ రేంజ్ పరిధిలో గత ఏడాది పోలీసులు నమోదు చేసిన 490 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 20,876 కిలోల గంజాయి, 23.68 లీటర్ల హాష్ ఆయిల్‌ను గురువారం అనకాపల్లి జిల్లా పరవాడ జేఎన్ ఫార్మా సిటీలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులో శాస్త్రీయ పద్ధతిలో దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని హోంమంత్రి అనిత పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, ఐజీపీ గోపీనాథ్ జెట్టి కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ఒకటని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఈగల్ (EAGLE) వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ రాకెట్‌పై కఠినంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
పోలీసు శాఖ సమష్టి కృషితో అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నియంత్రించగలిగామని ఆమె పేర్కొన్నారు. గంజాయి నిర్మూలన ఫలితంగా రాష్ట్రంలో క్రైం రేటు తగ్గిందని కూడా తెలిపారు.
విశాఖ రేంజ్ పరిధిలో ఇప్పటికే 234 గ్రామాలను మాదకద్రవ్యాల రహిత గ్రామాలుగా గుర్తించినట్లు చెప్పారు. ఈ గ్రామాలకు పంచాయతీరాజ్ శాఖ ద్వారా ప్రోత్సాహకాలు అందించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ప్రతిపాదనలు పంపనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల ఎస్పీలు సహా పలువురు ఉన్నత పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















