రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పార్కుల ఏర్పాటు లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే రెండేళ్లలో 130 ఎంఎస్‌ఎంఈ పార్కులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన వెల్లడించారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పోతవరం వద్ద ఏర్పాటు చేసిన ఆటోనగర్‌ను ఆయన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ఆటోనగర్ అభివృద్ధి పనులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు.
ఆటోనగర్‌లో మిగిలిన అభివృద్ధి పనుల కోసం వెంటనే రూ.2.8 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అవసరమైతే అదనంగా మరో 20 ఎకరాల భూమి కూడా కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆటోనగర్‌లో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పి.జే. అబ్దుల్ కలాం, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాలను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, తితిదే పాలకమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















