గతేడాది మార్చి 8న నమోదైన కేసు నేపథ్యంలో, ఉపముఖ్యమంత్రి Pawan Kalyanపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీసులు సోమవారం విచారించారు. ఈ విచారణ సుమారు ఎనిమిది గంటల పాటు కొనసాగింది.
విచారణ సమయంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు దువ్వాడ శ్రీనివాస్ తరచుగా “తెలియదు.. నాకేం సంబంధం లేదు” అంటూ సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. ఆయన మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను అధికారులు చూపించగా, అది ఏఐ (AI) వీడియో అంటూ ఆయన కొట్టి పడేసినట్లు తెలిసింది.
ఇదే సమయంలో కొత్తూరు పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దివ్వెల మాధురితో పాటు సుమారు 40 మందికి పైగా అనుచరులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించగా, మాధురి పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.
విచారణకు సహకరించకపోవడంతో దువ్వాడ శ్రీనివాస్‌కు ఈ నెల 27న మళ్లీ హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అలాగే స్టేషన్ ముందు ఆందోళన చేసిన ఘటనపై దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురితో పాటు మరో 16 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















