పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లను రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సోమవారం దిల్లీలో సత్కరించారు. మంగళవారం జరగనున్న పురస్కారాల ప్రదానోత్సవానికి ముందుగా దిల్లీకి వచ్చిన ఈ ప్రముఖులను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి గౌరవం ప్రకటించారు. మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లు తమ నటన, వైవిధ్యమైన పాత్రలతో తెలుగు సినిమా పరిశ్రమకు విశేషమైన గుర్తింపు తెచ్చారని మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. వారి సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు తెలుగుదేశం పార్టీ ఎంపీలు పాల్గొని ఈ సత్కార కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకతగా నిలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















