బాలకృష్ణ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం ‘NBK 112’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. అమరావతిలో జరిగిన ఈ ప్రారంభ వేడుకకు రాష్ట్ర మంత్రి, బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్వీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. క్లాప్ అనంతరం బాలకృష్ణ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్, ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తదితర సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభమై, 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ అమరావతిలో మొదటిసారి సినిమా పూజా కార్యక్రమం జరగడం ప్రత్యేకమని పేర్కొన్నారు. ఏపీలోని వివిధ ప్రాంతాల్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, ఎన్నో అద్భుతమైన లోకేషన్లు రాష్ట్రంలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ పుట్టిన నేలలో సినిమా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.
నారా లోకేశ్ మాట్లాడుతూ తొలిసారి సినిమా ఓపెనింగ్‌కు హాజరయ్యానని, అది కూడా తన మామయ్య బాలకృష్ణ సినిమా కావడం ప్రత్యేకమని అన్నారు. బాలయ్య నేతృత్వంలో ఏపీలో చిత్ర పరిశ్రమ మరింత బలోపేతం అవుతుందని, అవసరమైన అన్ని మౌలిక వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు.
మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో సినిమా రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విజయవాడ చిత్ర పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యమని, స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















