పల్నాడు జిల్లా మాచర్ల పరిధిలోని నగరవనం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి తుఫాను వాహనం బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని వెంటనే మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. వాహనం తీవ్రంగా దెబ్బతినడంతో అందులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.
మృతులను హైదరాబాద్‌కు చెందిన కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు శారద, సత్యనారాయణగా గుర్తించారు. ప్రమాద సమయంలో డ్రైవర్‌తో కలిపి వాహనంలో మొత్తం 13 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బంధువు మృతి చెందడంతో అంత్యక్రియల కోసం పామూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ ఘటనపై మాచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిద్రమత్తు కారణమా లేక అతివేగం వల్లే ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. ఘటనతో ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















