ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన నలుగురు సభ్యులు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన వారు, తిరిగి ఎన్నికైన వారితో కలిపి మొత్తం 10 మందితో రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. అనంతరం సభ్యులు ఛైర్మన్‌ను కలిసి పరిచయం చేసుకున్నారు.
తెదేపా నుంచి సానా సతీష్‌బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, జనసేన నుంచి లింగమనేని రమేశ్ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇదే కార్యక్రమంలో పరిమళ్ నత్వానీ, ప్రవీణ్ చక్రవర్తి, దేబాశిష్ సామంతరాయ్, రాజేశ్ పరమానంద్ శుక్లా కూడా ప్రమాణం చేశారు.
ముగ్గురు తెలుగు భాషలో ప్రమాణం చేయగా, చింతకాయల విజయ్ మంగళగిరి చేనేత కార్మికులు నేసిన పసుపు కండువా ధరించి హిందీలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, భాజపా సీనియర్ నేత కె.లక్ష్మణ్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ తదితరులు హాజరయ్యారు.
ప్రమాణస్వీకారం అనంతరం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు నూతన ఎంపీలను తన నివాసానికి ఆహ్వానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
లింగమనేని రమేశ్ మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యత్వాన్ని హోదాగా కాకుండా ప్రజల పట్ల ఉన్న అత్యున్నత బాధ్యతగా భావిస్తానని తెలిపారు. జనసేన ఆశయాలకు ప్రతినిధిగా దిల్లీకి వచ్చానని పేర్కొన్న ఆయన, పవన్ కల్యాణ్ విలువల ఆధారంగా రాజకీయ ప్రయాణం కొనసాగిస్తానని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















