రాజధాని ప్రాంతమైన అమరావతి అంతటా అధునాతన డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్ అభివృద్ధి కోసం ఏపీ డ్రోన్ కార్పొరేషన్, ఎయిర్‌బౌండ్ సంస్థ మధ్య కీలక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఈ ఒప్పందంపై గురువారం దిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు సమక్షంలో సంతకాలు జరిగాయి.
ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీ గీతాంజలి శర్మ, ఎయిర్‌బౌండ్ సంస్థ వ్యవస్థాపకుడు నమన్ పుష్ప్ ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ సమగ్ర డ్రోన్ ఆధారిత లాజిస్టిక్స్ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు.
లాజిస్టిక్స్, ఈ-కామర్స్, హెల్త్‌కేర్ వంటి కీలక రంగాల్లో సేవలు అందించేలా ఎయిర్‌బౌండ్ సంస్థ భాగస్వాములతో కలిసి పని చేయనుంది. వచ్చే ఏడాదిలో రోజుకు 10,000 డ్రోన్ ఫ్లైట్స్ నిర్వహించే లక్ష్యంతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ స్వదేశీ సంస్థతో భాగస్వామ్యం ద్వారా అతిపెద్ద డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కనెక్టివిటీ మెరుగవడంతో పాటు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఛైర్మన్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం కొత్త తరహా డెలివరీ వ్యవస్థకు నాంది పలుకుతుందని, ఆధునిక లాజిస్టిక్స్‌కు బలమైన పునాదులు వేస్తుందని అన్నారు.
ఎయిర్‌బౌండ్ సీఈవో నమన్ పుష్ప్ మాట్లాడుతూ వస్తు రవాణా వ్యవస్థ స్వరూపాన్నే డ్రోన్ డెలివరీ పూర్తిగా మార్చబోతోందని చెప్పారు. 20 టన్నుల ట్రక్ సామర్థ్యానికి సమానంగా డ్రోన్ల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్యాకేజీలను వేగంగా తరలించే నెట్‌వర్క్ నిర్మించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















