రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని, మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేయగా, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాలు అందించారు.
ఈ సందర్భంగా తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు చేయూతనివ్వాలని టీటీడీ అధికారులు కోరగా, అనంత్ అంబానీ సానుకూలంగా స్పందించారు. ఆయన టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందిస్తామని ప్రకటించారు. ఈ బస్సుల నిర్వహణ బాధ్యతలను కూడా రిలయన్స్ తీసుకుని, 50 మంది డ్రైవర్లను నియమించి వారి జీతభత్యాలను చెల్లించేందుకు అంగీకరించారు.
అలాగే తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తదుపరి ఆయన తిరుమలలోని ఎస్వీ గోశాలను సందర్శించారు. గుజరాత్‌లో రిలయన్స్ నిర్వహిస్తున్న వంతారా వన్యప్రాణి సంరక్షణ, పునరావాస కేంద్రం తరహాలో తిరుమల గోశాలను ఆధునికీకరించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
అంతకుముందు అనంత్ అంబానీ స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం కూడా పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















