అమెరికాలో జెట్‌బ్లూ ఏయిర్‌లైన్స్‌కు చెందిన విమానం త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఇంటర్నేషనల్ విమానాశ్రయం (JFK International Airport) సమీపంలో ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో డ్రోన్ విమానాన్ని ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది.
లాస్ వెగాస్ నుంచి వచ్చిన ఈ విమానం సుమారు 3,000 అడుగుల ఎత్తులో ఉండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. విమానంలో మొత్తం 159 మంది ప్రయాణికులు ఉన్నారు.
డ్రోన్ విమానం కాక్‌పిట్ వెలుపలి భాగాన్ని తాకినట్లు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు సమాచారం ఇచ్చాడు. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు జెట్‌బ్లూ ఏయిర్‌లైన్స్ వెల్లడించింది.
ఈ ఘటనపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తు ప్రారంభించింది. విమానాశ్రయ పరిసరాల్లో ప్రతి నెలా సగటున 100కు పైగా డ్రోన్లు గుర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నిషేధిత గగనతలంలో డ్రోన్లు ఎగరవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్ రద్దు సహా తీవ్ర శిక్షలు విధిస్తామని FAA హెచ్చరించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















