టెక్ సంస్థ మెటా వాట్సాప్ యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారుల ప్రైవసీని మరింత బలోపేతం చేయడానికి యూజర్‌నేమ్ (WhatsApp Username) అనే కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఇకపై ఫోన్ నంబర్ షేర్ చేయకుండానే యూజర్‌నేమ్‌తోనే ఇతరులతో చాట్ చేయడం సాధ్యమవుతుంది.
ఈ ఫీచర్‌ను ఈ ఏడాది చివర్లో విస్తృత స్థాయిలో విడుదల చేయనున్నట్లు మెటా ప్రకటించింది. అంతకుముందే యూజర్‌నేమ్‌లను రిజర్వ్ చేసుకునే ఆప్షన్‌ను కూడా ప్రారంభించింది.
ఫోన్ నంబర్ వ్యక్తిగత, ఆర్థిక విషయాల్లో కీలకమైనది కావడంతో, కొత్త వ్యక్తులతో నంబర్ పంచుకోవడం చాలామందికి ఇబ్బందిగా మారుతుంది. ఈ సమస్యను తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త ఫీచర్ తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది.
వాట్సాప్ వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్ట్) అలిస్ న్యూటన్ ప్రకారం, ఒక వ్యక్తిని తొలిసారి సంప్రదించాలంటే యూజర్‌నేమ్ తెలిసి ఉండటం తప్పనిసరి. అయితే ప్రైవసీ కోసం ఇప్పటికే ఉన్న బ్లాక్, అన్‌నోన్ కాల్ సైలెన్సింగ్ వంటి ఫీచర్లు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.
యూజర్‌నేమ్‌ను 3 నుంచి 35 అక్షరాల మధ్యలో సెట్ చేసుకోవచ్చు. ఇందులో a–z, 0–9, డాట్, అండర్‌స్కోర్ మాత్రమే అనుమతించబడతాయి. www, .com, .net వంటి వాటిని ఉపయోగించకూడదు. అదనంగా 4 అంకెల యూజర్‌నేమ్ కీని కూడా సెట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మొదటిసారి కాంటాక్ట్ చేయాలంటే యూజర్‌నేమ్‌తో పాటు ఆ కీని కూడా షేర్ చేయాల్సి ఉంటుంది.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాలు ఉన్న క్రియేటర్లు మరియు వ్యాపార సంస్థలు తమ ప్రస్తుత యూజర్ ఐడెంటిటీకి సరిపోయేలా యూజర్‌నేమ్ పొందేందుకు కూడా మెటా అవకాశం కల్పిస్తోంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ పరిమిత వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యూజర్‌నేమ్ ఆప్షన్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. లేకపోతే రాబోయే అప్‌డేట్‌లో ఇది అందుబాటులోకి రానుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















