ఇజ్రాయెల్ సైనికులు సిరియాలోని ఆబ్డీన్ పట్టణంలోకి చొచ్చుకెళ్లడం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా స్పందించి సైనికుల రాకను వ్యతిరేకించారు. వారిని వెనక్కి పంపేందుకు రాళ్లు విసిరి నిరసన తెలిపారు. రహదారులపై రాళ్లు అడ్డుగా పెట్టి నిరసన కొనసాగించారు.
ఇజ్రాయెల్ సరిహద్దుకు సమీపంలోని దక్షిణ సిరియాలో 235 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బఫర్ జోన్ గతంలో ఐక్యరాజ్య సమితి దళాల గస్తీ కింద ఉండేది. అయితే 2024 డిసెంబర్‌లో ఈ బఫర్ జోన్‌ను ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు సమాచారం.
అప్పటి నుంచి ఆ ప్రాంతానికి సమీపంలోని ఆబ్డీన్ పట్టణంలోకి ఇజ్రాయెల్ సైన్యం అప్పుడప్పుడు ప్రవేశించి గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో రెండుసార్లు ఆబ్డీన్‌లోకి ప్రవేశించి గస్తీ తిరగడానికి ప్రయత్నించగా స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.
పరిస్థితి అదుపు తప్పడంతో ఇజ్రాయెల్ సైనికులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం నిరసనకారులను చెదరగొట్టేందుకు ఫిరంగులను ప్రయోగించినట్లు సమాచారం. ఈ ఘర్షణల్లో ఎవరికీ గాయాలు కాలేదు.
అయితే ఇజ్రాయెల్ బలగాలు తమ ప్రాంతాన్ని ఆక్రమిస్తాయన్న భయంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఇప్పటికే తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.
తిరుగుబాటుదారులు దాడులు చేయకుండా అడ్డుకునేందుకే బఫర్ జోన్‌ను తాత్కాలికంగా ఆక్రమించామని ఇజ్రాయెల్ తొలుత ప్రకటించగా, ప్రస్తుతం ఆ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లే యోచన లేదని తెలిపినట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















