ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన ‘ఎన్’ సిరీస్‌లో తొలి స్మార్ట్‌ఫోన్‌గా OnePlus N6 ను విడుదల చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6360 చిప్‌సెట్‌తో వస్తోంది. 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అయితే ఈసారి కంపెనీ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో ఫోన్‌ను విడుదల చేయడం గమనార్హం.
OnePlus N6లో 6.75 అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. అలాగే ఐపీ65 రేటింగ్ సౌకర్యం కూడా ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్OS 16పై పనిచేస్తుంది. మిలిటరీ గ్రేడ్ (STD 810H డ్యూరబిలిటీ) సర్టిఫికేషన్‌తో ఈ డివైస్‌ను రూపొందించారు.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ విషయానికొస్తే, 2 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్స్‌తో పాటు 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ తెలిపింది.
కెమెరా విభాగంలో 50 ఎంపీ ప్రధాన కెమెరా, ముందు వైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించారు. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 6.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.
రంగుల విషయానికొస్తే ఫ్రెష్ మింట్, మిడ్‌నైట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది.
ధర విషయానికొస్తే, OnePlus N6 4GB + 128GB వేరియంట్ ధర రూ.22,999గా, 6GB + 128GB వేరియంట్ ధర రూ.24,999గా నిర్ణయించారు. ప్రైమ్ డే సేల్‌లో భాగంగా రూ.1,000 డిస్కౌంట్‌తో లభించనుంది. అలాగే SBI, Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు అదనంగా రూ.2,000 తగ్గింపు ఉంటుంది. దీంతో ప్రారంభ ధర రూ.19,999కి తగ్గుతుంది. జులై 4 నుంచి అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















