దేశ ప్రజలు ‘భాజపా ముక్త్ భారత్’ను కోరుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. పదేళ్ల భారాస, పన్నెండేళ్ల భాజపా, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై ఎప్పుడైనా చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. మూడ్రోజుల పర్యటనలో రాష్ట్ర సమస్యలు, సామాజిక పరిస్థితులు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంపై ఆయనకు అవగాహన లేకపోవడం స్పష్టమైందని అన్నారు.
తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, దేశానికి ఇచ్చిన హామీలు, కాళేశ్వరం అంశంపై సీబీఐ విచారణ, అయోధ్య విరాళాల వ్యవహారం వంటి అంశాలపై నితిన్ నబీన్ స్పందించలేదని ప్రశ్నించారు. వికసిత్ భారత్‌లో తెలంగాణ స్థానం ఏంటని ఆయన నిలదీశారు.
‘సర్’ పేరుతో ఓటర్ల జాబితాలో వ్యతిరేక ఓట్లను తొలగిస్తూ, అనుకూల ఓట్లను చేర్చుతున్నారనే అనుమానాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ప్రతిపక్ష హోదా పొందినప్పటికీ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు.
కేటీఆర్, హరీశ్‌రావులు కాంగ్రెస్‌పై విషప్రచారం చేస్తున్నారని మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. రాష్ట్ర రాజకీయాల్లో అన్ని అంశాలపై తాము చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















