ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాల సమయంలో వారు ఇంజినీర్ల అవతారం ఎత్తి ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆయన ఆరోపించారు.
భూపాలపల్లిలో ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన, ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట సుమారు రూ.1.25 లక్షల కోట్ల ప్రజాధనం వృథా చేశారని విమర్శించారు. ఈ ప్రాంతానికి వచ్చి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా వేల ఎకరాల పంట భూములు, ఇళ్లు మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని శ్రీధర్‌బాబు తెలిపారు. కన్నెపల్లికి వచ్చి మాట్లాడుతున్న కేటీఆర్ ముందుగా రైతులకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంపై జాతీయ సాంకేతిక నిపుణులు, నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల నివేదిక ఆధారంగానే మరమ్మతులు చేపడుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రమాదంలో ఉన్న బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలు సరైనవి కాదని ఆయన అన్నారు.
నీటిని నిల్వ చేస్తే బ్యారేజీలు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని డ్యాం సేఫ్టీ అధికారులు స్పష్టమైన నివేదిక ఇచ్చారని శ్రీధర్‌బాబు వివరించారు. ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సమయంలో ప్రతిపక్ష వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని ఆయన విమర్శించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















