ప్రజా రవాణాను మరింత ఆధునీకరించే దిశగా ఆర్టీసీ కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జేబీఎం సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులను పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. మరో రెండు రోజుల్లో మొత్తం 268 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
జేబీఎం సంస్థకు చెందిన కొత్త ఎలక్ట్రిక్ బస్సులకు సాంకేతిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సాంకేతిక బృందం 118 బస్సులకు బుధవారం ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పటికే ప్రయాణికుల సేవల్లో ఉన్న 150 బస్సులతో కలిపి జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 268కి చేరిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
జేబీఎం సంస్థ నుంచి మొత్తం 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు. మిగిలిన బస్సులకు కూడా సాంకేతిక పరీక్షలు వేగంగా నిర్వహిస్తున్నామని, వాటిని కూడా త్వరలోనే ప్రయాణికుల సేవలకు వినియోగించే అవకాశం ఉందని ఆర్టీసీ పేర్కొంది.
హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ సాంకేతిక బృందం, జేబీఎం సంస్థకు చెందిన టెక్నికల్ టీమ్, చైనా నుంచి వచ్చిన బ్యాటరీ నిపుణులు కలిసి బస్సుల పనితీరును పరిశీలించారు. బ్యాటరీ సామర్థ్యం, భద్రతా ప్రమాణాలు, సాంకేతిక అంశాలను పరిశీలించిన అనంతరం అర్హత సాధించిన బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేశారు.
ఎలక్ట్రిక్ బస్సుల రాకతో కాలుష్యం తగ్గడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. పర్యావరణ హితమైన ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగానే ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు వెల్లడించారు.
కొత్తగా అందుబాటులోకి వచ్చే ఎలక్ట్రిక్ బస్సులను ప్రధాన మార్గాల్లో నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రయాణికుల ఆదరణ, అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















