దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ ఛైర్మన్ టేక్ సుంగ్‌లీ నేతృత్వంలోని ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను ఆటోమోటివ్, ఈవీ తయారీ రంగాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికలను వివరించారు. రాష్ట్రంలో ఈవీ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, గ్రీన్ కారిడార్లలో ప్రతి 30 కిలోమీటర్లకు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు పుంగనూరులో ఈవీ క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
శ్రీసిటీ–చిత్తూరు–తిరుపతి పారిశ్రామిక కారిడార్ వెంట కొరియన్ ఆటో కాంపోనెంట్స్ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. ఆటో విడిభాగాల తయారీ, టూలింగ్, టెస్టింగ్ సదుపాయాల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం ఏపీఈడీబీలో కొరియా డెస్క్‌తో పాటు ఉమ్మడి వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
కొరియా కంపెనీలతో జరిగిన సమావేశాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు. శ్రీసిటీ లేదా తిరుపతిలో గృహోపకరణాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కుకూ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులను కోరారు. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
అలాగే ఈవీ విడిభాగాలు, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్స్ తయారీ యూనిట్లను ఏపీలో ఏర్పాటు చేయాలని మోటివ్ లింక్ సంస్థ ప్రతినిధులను మంత్రి ఆహ్వానించారు. రాష్ట్రంలో సముద్ర రవాణా, షిప్ బిల్డింగ్ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను హెచ్‌డీ కొరియా షిప్‌బిల్డింగ్ ప్రతినిధులకు వివరించారు.
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ (బీఈఎస్) తయారీ యూనిట్ ఏర్పాటుపై డెల్టా ఎక్స్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి తెలిపారు.
ఇక తిరుపతి జిల్లా నాయుడుపేటలో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల (PCB) తయారీ క్లస్టర్ ఏర్పాటుపై కూడా చర్చలు జరిగాయి. ఈ ప్రాంతంలో ఈవీ, ఆటోమొబైల్, హెల్త్‌కేర్, స్మార్ట్ మీటరింగ్ రంగాలకు అవసరమైన PCBలు, CCL, EMS ఉత్పత్తుల తయారీకి భారీ ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశాలను కంపెనీలు పరిశీలిస్తున్నాయి.
దీనితో పాటు రాష్ట్రంలో శాంసంగ్ సిటీ ఏర్పాటుకు ముందుకు రావాలని మంత్రి నారా లోకేశ్ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులను కోరారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో శాంసంగ్ ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, రాజధాని అభివృద్ధి, పారిశ్రామిక మౌలిక సదుపాయాల నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.
కొరియా సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఈవీ తయారీ రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కొరియా డెస్క్ ఏర్పాటు ద్వారా పెట్టుబడిదారులకు వేగవంతమైన అనుమతులు, సమన్వయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















