జంట నగరాల్లో పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడం వల్ల ప్రజారోగ్యం, పర్యావరణంపై పడుతున్న ప్రభావాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని, జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది.
హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పావురాలకు ఇష్టానుసారంగా ఆహారం వేయడం వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు ప్రజారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటూ ముషీరాబాద్‌కు చెందిన డాక్టర్ రాధేశ్యాం టపాడియా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పావురాల వల్ల చారిత్రక కట్టడాలు, ఇతర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
పావురాలకు ఆహారం వేయడంపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు విధించేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. వాదనలు విన్న ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















