కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. గ్లాస్గోలో జరిగిన హెవీవెయిట్ పారా పవర్‌లిఫ్టింగ్ ఫైనల్లో భారత పారా అథ్లెట్ ఝండూ కుమార్ కాంస్య పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించాడు. 190 కిలోల బరువును ఎత్తిన ఝండూ 130.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.
తొలి ప్రయత్నంలో 181 కిలోలను సులువుగా ఎత్తిన ఝండూ.. రెండో ప్రయత్నంలో 190 కిలోలను విజయవంతంగా లిఫ్ట్ చేశాడు. దీంతో కొంతసేపు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణంపై ఆశలు రేకెత్తించాడు. చివరి ప్రయత్నంలో 196 కిలోలను ఎత్తేందుకు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయాడు. అయినప్పటికీ అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుని భారత పతకాల పట్టికలో బోణీ కొట్టాడు.
ఝండూ కుమార్ విజయానికి ఆయన జీవిత ప్రయాణమే అసలైన స్ఫూర్తి. బిహార్‌లోని నలంద జిల్లా హర్నౌత్ గ్రామంలో పేద కుటుంబంలో జన్మించిన ఝండూ చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డాడు. అయితే తన వైకల్యాన్ని ఎప్పుడూ తన ఎదుగుదలకు అడ్డంకిగా భావించలేదు. షాట్‌పుట్, డిస్కస్ త్రో వంటి క్రీడల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించాడు. ఆ తర్వాత పవర్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకుని ఆ దిశగా శిక్షణ ప్రారంభించాడు.
శిక్షణ, పోషకాహారం కోసం అవసరమైన డబ్బు సంపాదించేందుకు కూరగాయలు విక్రయించడంతో పాటు ఈ-రిక్షా కూడా నడిపాడు. రిక్షా నడపగా వచ్చిన ఆదాయాన్ని తన శిక్షణకు ఉపయోగించుకున్నాడు. కష్టాలను అధిగమిస్తూ అంచెలంచెలుగా ఎదిగిన ఝండూ.. జాతీయ స్థాయిలో రికార్డులు సృష్టించి, అంతర్జాతీయ పోటీల్లోనూ పతకాలు సాధించాడు.
2025 జాతీయ ఛాంపియన్‌షిప్‌లో 205 కిలోల బరువును ఎత్తి జాతీయ రికార్డు సృష్టించిన ఝండూ.. ఆ తర్వాత ఖేలో ఇండియా పారాగేమ్స్‌లో 206 కిలోలు ఎత్తి మరో రికార్డు నమోదు చేశాడు. బీజింగ్ వరల్డ్ కప్, ఏషియన్, ఓషియానా ఛాంపియన్‌షిప్‌ల్లోనూ కాంస్య పతకాలు సాధించాడు. ఇప్పుడు కామన్వెల్త్ వేదికపై భారత్‌కు తొలి పతకం అందించి తన విజయగాథను మరింత గొప్పగా మలిచాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















