ఎండాకాలంలోనే కళ్ల పొడిబారడం ఎక్కువగా ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ వాతావరణంతో సంబంధం లేకుండానే డ్రై ఐ సమస్య కొందరిని ఇబ్బంది పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. కన్నీళ్లు తగినంతగా ఉత్పత్తి కాకపోవడం, కళ్లపై ఉండే అశ్రుపొరలో సమస్యలు రావడం, కన్నీటి తేమ త్వరగా ఆవిరైపోవడం వంటి కారణాలతో ఈ సమస్య తలెత్తవచ్చు.
డ్రై ఐ కారణంగా కళ్లలో దురద, మంట, ఎర్రబడటం, మసకగా కనిపించడం, కళ్ల నుంచి నీళ్లు అధికంగా రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా మహిళల్లో వయసు పెరిగేకొద్దీ ఈ సమస్య ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. హార్మోన్ల మార్పులు, గర్భధారణ, మెనోపాజ్, కొన్ని మందుల వినియోగం, థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలు కూడా ప్రభావం చూపవచ్చు.
ఇక ఎక్కువసేపు మొబైల్, కంప్యూటర్ లేదా ఇతర డిజిటల్ స్క్రీన్‌లను చూడటం వల్ల రెప్పలు తక్కువగా కొట్టడం కూడా కళ్ల పొడిబారడానికి కారణమవుతుంది. ఏసీలో ఎక్కువసేపు ఉండటం, కాంటాక్ట్ లెన్స్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం, ఐమేకప్‌ను సరిగ్గా తొలగించకపోవడం వంటి అలవాట్లు కూడా కళ్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.
కళ్లకు తరచూ విశ్రాంతి ఇవ్వడం, స్క్రీన్ ఉపయోగించే సమయంలో క్రమం తప్పకుండా రెప్పలు కొట్టడం, కళ్ల పరిశుభ్రతను పాటించడం, ఐమేకప్‌ను సమయానికి పూర్తిగా తొలగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లలో మంట, పొడిబారడం లేదా మసక చూపు వంటి సమస్యలు తరచూ ఇబ్బంది పెడితే స్వయంగా మందులు వాడకుండా కంటి వైద్యుడిని సంప్రదించడం మంచిది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















