పేపర్ లీకేజీకి పాల్పడే వ్యక్తులు, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే ముఠాలపై కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 2024 నాటి ప్రవేశ పరీక్షల అక్రమ పద్ధతుల నివారణ చట్టానికి సవరణలు చేసేందుకు ఉద్దేశించిన యాంటీ పేపర్ లీక్ బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ చట్ట సవరణకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. విపక్షాల ఆందోళనల మధ్యే బిల్లు ప్రవేశపెట్టగా, దీనిపై సభ్యులు తమ సూచనలు, అభిప్రాయాలను సమర్పించేందుకు స్పీకర్ ఓం బిర్లా అవకాశం కల్పించారు. బిల్లుపై సవివర చర్చకు తగిన సమయం ఇస్తామని ఆయన తెలిపారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం వ్యక్తిగతంగా పేపర్ లీకేజీకి పాల్పడిన కేసుల్లో 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. వ్యవస్థీకృత నేరాలకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.కోటి వరకు జరిమానా నిబంధనలు ఉన్నాయి. తాజా సవరణలకు ఆమోదం లభిస్తే పేపర్ లీకేజీ నేరాల్లో దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే బిల్లు ఆమోదం పొందిన తర్వాతే తుది నిబంధనలు అమల్లోకి వస్తాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















