దిల్లీలో జరిగిన విద్యార్థుల ఆందోళనల సమయంలో విధులు నిర్వహిస్తూ గాయపడిన పోలీసుల కుటుంబ సభ్యులు తమ ఆవేదనను మీడియా ముందు వెల్లడించారు. నిరసనల్లో పోలీసులపై జరిగిన దాడులను కూడా పరిగణనలోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఓ దిల్లీ పోలీసు ఎస్సై కుమార్తె మాట్లాడుతూ.. తన తండ్రి గతంలో 15 ఏళ్ల పాటు నేవీలో మెరైన్ కమాండోగా సేవలందించి, ప్రస్తుతం దిల్లీ పోలీసు విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. ఆందోళనల సమయంలో జంతర్ మంతర్ వద్ద విధులు నిర్వహిస్తుండగా కొందరు ఆయనపై దాడికి యత్నించారని, తీవ్రంగా గాయపడిన తన తండ్రిని ఆసుపత్రికి తరలించారని చెప్పారు. నాలుగు గంటల పాటు ఆయన స్పృహలో లేరని, ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చే సమయానికి యూనిఫామ్ మొత్తం రక్తంతో తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరో పోలీసు అధికారి భార్య సీమా మాట్లాడుతూ.. తన భర్త 33 ఏళ్లుగా దిల్లీ పోలీసు శాఖలో పనిచేస్తున్నారని తెలిపారు. ఆందోళనల సమయంలో రాళ్లు, చెప్పులతో దాడి చేయడంతో ఆయన ధరించిన హెల్మెట్ సైతం విరిగిపోయిందని చెప్పారు. నిరసనలకు సంబంధించిన వార్తల్లో పోలీసుల చర్యల గురించే ఎక్కువగా ప్రస్తావన వస్తోందని, అయితే పోలీసులపై జరిగిన దాడులను కూడా ప్రజలు గుర్తించాలని కోరారు.
మరో పోలీసు కుమారుడు మాట్లాడుతూ.. బారికేడ్ల వద్ద విధులు నిర్వహిస్తున్న తన తండ్రిపై రాళ్ల దాడి జరిగిందని తెలిపారు. సీనియర్ అధికారులను రక్షించే క్రమంలో ఆయన తలకు తీవ్ర గాయమై నాలుగు కుట్లు పడ్డాయని చెప్పారు. విద్యార్థుల పట్ల తన తండ్రి ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించరని పేర్కొన్నారు.
ఆందోళనల్లో గాయపడిన పోలీసుల కుటుంబ సభ్యులు కలిసి తమకు కూడా న్యాయం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















