కామన్వెల్త్ గేమ్స్-2026లో 39 పతకాలతో సత్తాచాటిన భారత క్రీడాకారులపై ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. అథ్లెట్ల అంకితభావం, క్రమశిక్షణ, కోచ్‌ల మార్గదర్శకత్వం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఈ విజయానికి ప్రధాన కారణాలని పేర్కొన్నారు.
ప్రపంచ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన ప్రతి అథ్లెట్ దేశ ప్రజల ఆశలకు ప్రతీకగా నిలిచారని పవన్ అన్నారు. భారత క్రీడాకారుల విజయాలు దేశంలోని కోట్లాది మంది యువతకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. భయపడకుండా కలలు కని, వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడాలని ఈ విజయాలు సందేశమిస్తున్నాయని తెలిపారు.
పతకాలు సాధించిన క్రీడాకారులతో పాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి అథ్లెట్, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్, కుటుంబ సభ్యులకు పవన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారత క్రీడలు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జులై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరిగిన కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత్ మొత్తం 39 పతకాలు సాధించింది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















