గురుగ్రామ్: భార్య విడాకులు కోరడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో విషాదం నింపింది. మరింత విషాదకరమైన విషయం ఏమిటంటే.. తండ్రి ఉరికి వేలాడుతున్న దృశ్యాలను ఆయన ఏడేళ్ల కుమారుడు వీడియోగా చిత్రీకరించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది.
పోలీసుల వివరాల ప్రకారం.. అమృత్‌సర్‌కు చెందిన సంజీవ్ యాదవ్ (36) గురుగ్రామ్‌లోని ఓ బహుళజాతి సంస్థలో అసోసియేట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. 2018లో ఆయన మన్‌ప్రీత్ కౌర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవల కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మన్‌ప్రీత్ విడాకులు కోరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వివాదాల నేపథ్యంలో సంజీవ్ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఆయన ఉరికి వేలాడుతుండగా ఏడేళ్ల కుమారుడు ఆ దృశ్యాలను తన ఫోన్‌లో రికార్డ్ చేశాడు. అదే సమయంలో మన్‌ప్రీత్ కేకలు వేస్తూ చుట్టుపక్కల వారిని సహాయం కోసం పిలుస్తున్న దృశ్యాలు కూడా వీడియోలో నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
అయితే సంజీవ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెనుక మన్‌ప్రీత్ పాత్ర ఉండవచ్చని ఆరోపిస్తూ సమగ్ర దర్యాప్తు చేయాలని సంజీవ్ తండ్రి పోలీసులను కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు మన్‌ప్రీత్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన వీడియో, ఇతర ఆధారాలను పరిశీలిస్తూ పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















