మన రోజువారీ జీవితంలో మొబైల్, డబ్బు, తలుపుల హ్యాండిల్స్, బహిరంగ ప్రదేశాల్లోని వస్తువులను తాకడం వల్ల చేతులకు సూక్ష్మక్రిములు చేరుతాయి. అలాంటి చేతులతో కళ్లను, ముక్కును, నోటిని తాకడం లేదా ఆహారం తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ, విరేచనాలు, కడుపు ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఎప్పుడు చేతులు కడుక్కోవాలి?
భోజనం చేసే ముందు, వంటకు ముందు, వాష్‌రూం ఉపయోగించిన తర్వాత, దగ్గిన లేదా తుమ్మిన తర్వాత, చెత్తను తాకిన అనంతరం, పెంపుడు జంతువులను తాకిన తర్వాత, అనారోగ్యంతో ఉన్నవారిని చూసుకున్న తర్వాత, బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలి.
సరిగ్గా ఎలా కడుక్కోవాలి?
నీటితో చేతులను తడిపి సబ్బు రాసుకోవాలి. అరచేతులు, చేతుల వెనుక భాగం, వేళ్ల మధ్య, బొటనవేళ్లు, గోళ్ల కింద భాగాలను కనీసం 20 సెకన్ల పాటు బాగా రుద్దాలి. అనంతరం శుభ్రమైన నీటితో కడిగి, శుభ్రమైన టవల్‌తో ఆరబెట్టుకోవాలి.
సబ్బు లేకపోతే?
సబ్బు, నీరు అందుబాటులో లేనప్పుడు కనీసం 60 శాతం ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించవచ్చు. అయితే చేతులకు ఎక్కువ మురికి ఉంటే సబ్బు, నీటితోనే శుభ్రం చేసుకోవాలి.
పిల్లలకు అలవాటు చేయండి
చిన్నప్పటి నుంచే చేతులు శుభ్రంగా కడుక్కోవడం నేర్పితే అనేక అంటువ్యాధుల వ్యాప్తిని తగ్గించవచ్చు. చిన్న అలవాటే అయినా.. ఆరోగ్యాన్ని కాపాడే గొప్ప రక్షణ చర్య చేతుల పరిశుభ్రత!
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















