అస్సాంలోని నగావ్ జిల్లాలో సీఆర్‌పీఎఫ్ క్యాంపులో మంగళవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 34వ బెటాలియన్‌కు చెందిన ఏఎస్ఐ బల్లాని ప్రేమబరం తన సర్వీస్ రైఫిల్‌తో సహచర జవాన్లపై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతిచెందగా, మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఏఎస్ఐ అదే ఆయుధంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఉదయం సుమారు 7 గంటల సమయంలో క్యాంపు ప్రధాన గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ.. గార్డు రూమ్ నుంచి ఇన్‌సాస్ రైఫిల్ తీసుకుని వెనుక వైపు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. అక్కడ విధుల్లో ఉన్న ఇద్దరు సహచర జవాన్లపై కాల్పులు జరిపారు. అనంతరం మరో జవాన్‌పై కూడా కాల్పులు జరపడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జవాన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాల్పుల అనంతరం బ్యారక్‌లోకి వెళ్లిన ఏఎస్ఐ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న సీనియర్ సీఆర్‌పీఎఫ్, పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాల్పులకు దారితీసిన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. వ్యక్తిగత కారణాలు, విధి సంబంధిత సమస్యలు లేదా ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















